EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మీ మ‌ర‌ణాన్నిఅంచ‌నా వేసే ఏఐ టూల్ దీర్ఘాయువు దిశ‌గా పరిశోధ‌కుల బృందం క‌స‌ర‌త్తు

 

న్యూయార్క్ డిసెంబర్ 21 (ఈతరం న్యూ స్);: త‌మ జీవిత కాలం ఎంత అనే విష‌యంలో చాలా మంది పెద్ద‌గా ఆలోచించ‌రు. అయితే అన్ని విష‌యాల్లో ముందుగా ప్లాన్ చేసుకునే వారు ఈ విష‌యంలో ఉత్సుక‌త‌తో ఉంటారు. ఇక ఓ ఏఐ టూల్ యూజ‌ర్ల జీవితాన్ని విశ్లేషించి వారు ఎప్పుడు మ‌ర‌ణిస్తార‌నే వివ‌రాల‌ను అంచ‌నా వేస్తోంది. ఈ టూల్ అందించే స‌మాచారం క‌చ్చిత‌త్వంపై ఎలాంటి ధ్రువీక‌ర‌ణ లేకున్నా ఆ స‌మాచారాన్ని స‌ర‌దాగా తీసుకోవ‌డం మేల‌ని చెబుతున్నారు. వ్య‌క్తి ఎప్పుడు మ‌ర‌ణిస్తాడ‌ని అంచ‌నా వేసే గ్రౌండ్‌బ్రేకింగ్ ఏఐ టూల్‌పై న్యూయార్క్ పోస్ట్ స‌మ‌గ్ర క‌థ‌నం వెల్ల‌డించింది.టెక్నిక‌ల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ ప్రొఫెస‌ర్ సునె లీమాన్ లైఫ్‌2వెక్ అనే ఈ న్యూ అల్గారిథ‌మ్‌ను డెవ‌ల‌ప్ చేశారు. ఆదాయం, వృత్తి, నివాసం, ఆరోగ్యం, కుటుంబ చ‌రిత్ర వంటి వ్య‌క్తి వివ‌రాల‌ను విశ్లేషిస్తూ 78 శాతం క‌చ్చిత‌త్వంతో వ్య‌క్తి జీవ‌న కాలాన్ని ఈ ఏఐ టూల్ అంచ‌నా వేస్తుంది. లైఫ్‌2వెక్ కేవ‌లం వ్య‌క్తి మ‌ర‌ణాన్ని అంచ‌నా వేయ‌డ‌మే కాకుండా వ్య‌క్తిత్వాన్ని ఆవిష్క‌రించ‌డంతో పాటు ఇత‌ర దేశాల‌కు వెళ్లడం వంటి అనేక అంశాల‌ను అంచ‌నా వేస్తుంది. 2008 నుంచి 2020 మ‌ధ్య లీమాన్ బృందం ఏకంగా 60 ల‌క్ష‌ల మంది డెన్మార్క్ వాసుల‌పై విస్తృత ప‌రిశోధ‌న సాగించింది.లైఫ్‌2వెక్ మెరుగైన క‌చ్చిత‌త్వ రేటుతో 2020 వ‌ర‌కూ మ‌ర‌ణించిన వ్య‌క్తుల‌ను దాదాపుగా ఎలాంటి దోషాలు లేకుండా అంచ‌నా వేయ‌గ‌లిగింది. పురుషుడిగా ఉండటం, మానసిక ఆరోగ్య సమస్యలు లేదా నైపుణ్యం కలిగిన ఉద్యోగాన్ని కలిగి ఉండటం వంటివి ముందస్తు, అకాల‌ మరణానికి దారితీసే కారకాలను కూడా అధ్యయనం గుర్తించింది. దీనికి విరుద్ధంగా, అధిక ఆదాయం, నాయకత్వ పొజిష‌న్ క‌లిగి ఉండ‌టం దీర్ఘాయువుతో ముడిప‌డి ఉన్నాయ‌ని వెల్ల‌డైంది. ఇక ఈ ఏఐ టూల్ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌జ‌ల‌కు, కార్పొరేష‌న్స్‌కు అందుబాటులో లేక‌పోయినా ప్ర‌జ‌లు దీర్ఘాయువుతో జీవించడానికి ఈ ఏఐ టూల్ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే విష‌యంపై లీమాన్ ఆయ‌న బృందం క‌స‌ర‌త్తు సాగిస్తోంది. వ్య‌క్తుల గోప్య‌తకు భంగం వాటిల్ల‌కుండా స‌మాజానికి ఏఐ ప్ర‌యోజ‌నాలు చేకూరేలా లీమాన్ బృందం ప్ర‌య‌త్నిస్తోంది.

 

 

Related News

Select the Topic
Scroll to Top