EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం కేంద్ర ప్రభుత్వానికి సూచించిన ఢిల్లీ హైకోర్టు

 

న్యూఢిల్లీ డిసెంబర్ 21 (ఈతరం న్యూ స్);: దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. స్థిర, చరాస్తులను ఆధార్‌కి అనుసంధానం చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(పిల్‌) విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ సూచనలు చేసింది. దేశంలో నల్లధనం, అవినీతి, బినామీల నివారణకు ఆధార్‌తో అనుసంధానం ఒక కీలక చర్య అవుతుందని పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పూర్తి పరిశీలన అనంతరం విచారణ ముగించినట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలను ఒక విజ్ఞాపనగా తీసుకుని పరిశీలించాలని కేంద్రానికి సూచన చేసింది

Related News

Select the Topic
Scroll to Top