హైదరాబాద్ జనవరి 19 (eetaram bharatam news);బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలను మోసం చేశారు కాబట్టే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.బీఆర్ఎస్ నాయకుల ఆహాంకార దోరణి, కుటుంబ పాలన వల్ల ప్రజలు విసిగి, వేసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు.మీరు పదేండ్లు అధికారంలో ఉండి దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా మీరిచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు.కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి తీరుతుంది. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతా మన్నారు.కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఎందో ప్రజలకు తెలుసు. మిగితా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను కూడా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ప్రజా పాలనకు అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తుల డిజిటలైజ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి రెండు హామీలను నెరవేర్చారు. మహిళలకు ఫ్రీ బస్ సేవలు అమలు చేయడంతో వారి నుంచి అనూహ్య స్పందన వస్తుంది. రెండు హామీలను అమలు చేస్తేనే బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. ఇంకా మిగతా హామీలు అమలు చేస్తే ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా తూడ్చిపెట్టుకుపోతుందని ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవుతుందని, ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడుతారు అని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరి పార్టీ గల్లంతు అవుతుందో మరో మూడు నెలలు ఆగితే తేలుతుందన్నారు.ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు అవడం ఖాయం. అందుకే… మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం, కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తాం అని బీఆర్ఎస్ నాయకులే చెప్పారు. మరి పట్టుమని రెండు నెలల కూడా కాకముందే ఎందుకు అంత ఉలికి పడుతున్నారన్నారు.పథకాలు అమలైతే బీఆర్ఎస్ పార్టీ మూత పడుతది కాబట్టే… కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావద్దని బీఆర్ఎస్ నేతలు గట్టిగా కోరుకుంటున్నారన్నారు.కానీ వారివి పగటి కలలు మాత్రమే. ఆరు గ్యారంటీలు అమలు కావడం గ్యారంటీ… బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగు కావడం గ్యారంటీవచ్చే లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అందుకే పార్టీని బతికించుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మంతనాలు కొనసాగుతున్నాయని అన్నరు.గత పదేండ్లలో బీజేపీతో అంటకాగారు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు.ఎవరు ఎన్ని చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతుందని జ్యోస్యం చెప్పారు.సమీక్షల పేరుతో సమావేశాలు పెట్టి .. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారు. ఎవరు ముందుకు రావడం లేదు మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. ఆ పార్టీని వీడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో కేసిఆర్ కుటుంబం తప్ప ఒక్కరు కూడా మిగలరన్నారు..అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ ను కాపాడుకునేందుకే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ అమలు చేయదు అని మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరు ఎంత చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో ఖాళీ అవడం ఖాయం మీరు ఎంత అసత్య ప్రచారం చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మరుఇది ఇట్లా ఉంటే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం తో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు పేరుతో కమిషన్ల కోసం ప్రజా ధనాన్ని దోచుకున్నారు. నిధులను దుర్వినియోగం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయాల ప్రజా ధనం నీళ్ల పాలు అయిందని కాగ్ నివేదికలే చెబుతున్నాయన్నారు.మిషన్ భగీరథ పథకంలో కూడా పెద్ద కుంభకోణం జరిగింది.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తాం. ప్రతీ పైసాకు వారు లెక్క చెప్పాల్సిందే నన్నారు.















