EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆలేరు పాఠశాలను సందర్శించిన ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయానంద ఖండూరి.

యాదాద్రి భువనగిరి, జనవరి 21(eetarambharatamnews). ఆలేరు  జిల్లా పరిషత్ఉన్నతపాఠశాల ను శనివారం వరంగల్ పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ అజయానంద్ ఖండూరి సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఎన్సిసి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.

ఉపాధ్యాయుల ఉద్దేశించి కల్నల్ అజయానంద ఖండూరి మాట్లాడుతూ ఆలేరు పాఠశాలలో ఎన్సిసి చాలా పేరుపొందిందని, దీనికి ఎన్సిసి అధికారితో పాటు ఈ పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని అన్నారు. ఆలేరు ఎన్సిసి విద్యార్థులకు బెటాలియన్ లో మంచి పేరు ఉందని, దానికి కృషి చేస్తున్నది ఎన్సిసి అధికారి మరియు పాఠశాల ఉపాధ్యాయ వర్గమే అని తెలిపారు. రాబోయే కాలంలో కూడా ఈ సహకార భావనతో విద్యార్థులను ఎన్సీసీలో చేరేలా ప్రోత్సహించాలని, తద్వారా పరోక్షంగా దేశ రక్షణలో పాలుపంచుకోవాలని ఉపాధ్యాయులను ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఎన్సిసిలో చేరేందుకు విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని, వారికి ఎన్సీసీ ద్వారా పై చదువులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలేరు ఎన్సిసి విభాగాన్ని, పాఠశాల మైదానాన్ని, డిజిటల్ తరగతి గదులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్సీసీలో ఎనలేని సేవ చేస్తున్న అధికారి దూడల వెంకటేష్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రతిసారి ఈ పాఠశాల ఎన్సిసి విద్యార్థులు ఐ ఐ ఐ టీ లో సీట్లు పొందడం సంతోషమని, అలాగే ఈసారి కూడా రేపు జరగబోయే పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు పొంది ఐఐఐటి లో సీట్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి దూడల వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, ఉపాధ్యాయులు కోటగిరి శేఖర్, మంద సోమరాజు, యోగేశ్వరరావు, హరినాథ్ రెడ్డి, సాంబశివ, ఖాజా అలీ, నవీన్, రవి, వేణు, విజయలక్ష్మి, కవిత, స్వర్ణలత, లక్ష్మమ్మ, మీరా తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top