EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోరంత సైజులో ఆయోధ్య రామాలయం

నాగర్ కర్నూలు జనవరి 21 (eetaram bharatam news);తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి  రామయ్యపై భక్తితో తన స్వర్ణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనాను రూపొందించాడు.Ayodhya Temple: అయోధ్య రామాలయంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనం ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు.శ్రీరాముడి పేరు మీద ఓ టాటూ ఆర్టిస్ట్‌ భక్తులకు ఉచితంగా టాటూలు వేస్తున్నాడు. ఓ ట్రస్ట్‌ వాళ్లు రామయ్య కోసం 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలను శ్రీరామ తీర్ధ క్షేత్ర ట్రస్టు వారికి అందజేశారు. కొందరు లడ్డూలు చేసి పంపుతున్నారు. మరికొందరు రాముడు, సీత, అయోధ్య ఆలయ నమూనాలతో ఆభరణాలను తయారు చేసి భక్తిని చాటుకుంటున్నారు.తాజాగా తెలంగాణ నుంచి నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కూడా రామయ్యపై భక్తితో తన స్వర్ణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనాను రూపొందించాడు.గోపి చారి రూపొందించిన ఈ అయోధ్య నమూనా 1.5 సెంటీ మీటర్ల ఎత్తు, 1.75 సెంటీ మీటర్ల వెడల్పు, 2.75 సెంటీ మీటర్ల పొడవుతో ఉంది. ఈయన గతంలో కూడా బంగారంతో Tట్వంటీ వరల్డ్‌కప్‌ నమూనాను తయారు చేశాడు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సూక్ష్మ నమూనాలను తయారు చేస్తానని చెబుతున్నాడు. గ్రామానికి చెందిన స్వర్ణకారులు గోపిని సన్మానించారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top