యాదాద్రి భువనగిరి, జనవరి 20(eetaram bharatam news)యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని లింగా బసవ గార్డెన్స్ లో శనివారం రోజు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ను కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గొల్ల కురుమలంతా బీర్ల ఐలయ్య ను డప్పు,డోళ్ల కోలాటాల మధ్య స్వాగతం పలికారు.ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గొల్ల కురుమలంతా ఏకం కావాలని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీ తంగా గొల్ల కురుమబిడ్డలను గెలిపించుకోవలని కోరారు.అంతా ఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమైవుతుందన్నారు.గొల్ల కురుమ బిడ్డలంతా చదువుకోవాలన్నారు.చదువు ఉంటేనే అటు వ్యాపారంలోగాని,రాజకీయరంగంలో గాని,ఇతర రంగాల్లో ముందుఉండటానికి కారణమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,గొల్ల కురుమ కులస్తులు,తదితరులు పాల్గొన్నారు.















