మన కాంతి పుంజాలు…
(స్ఫూర్తిమూర్తుల జీవనరేఖలు)
వరంగల్ శ్రీలేఖ సాహితి ప్రచురణగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ టి శ్రీరంగస్వామి స్ఫూర్తిమూర్తుల జీవనరేఖలను మనకాంతి పుంజాలు పేరుతో పుస్తకంగా వెలువరించారు. చరిత్రలో స్థానాన్ని పొందిన కొందరు కీర్తిశేషులైన స్ఫూర్తిదాతలు, రచయితలు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధుల పరిచయ మాలికగా ఈ పుస్తకం రూపొందింది. కేవలం వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు చెందినవారే కాకుండా పక్క జిల్లాల వారిని గురించి కూడా ఇందులో రాశారు. ఉమ్మడి వరంగల్ దారి దీపాలు తొలి వ్యాసం కాగా అందులో విస్తృతంగా ఆ ప్రాంతపు వ్యక్తులను గురించిన విశేషాలు కన్పిస్తాయి. కైరం భూమాగౌడ్, పరాంకుశం సమ్మాళ్వారయ్య, ఆకారపు నరసింగం గుప్త, ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు, గంగుల శాయిరెడ్డి, అంబటి లక్ష్మీనరసింహరాజు, గార్లపాటి రాఘవారెడ్డి, చాట్రాతి లక్ష్మీనరసమ్మ, గొట్టుముక్కల రాధాకృష్ణారావు, చందా కాంతయ్యశ్రేష్ఠ, కేశపోగు గుల్బానమ్మ, కందాళై గోపాలాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు, ఉదయరాజు శేషగిరిరావు, హరి రాధాకృష్ణమూర్తి, కాళోజి రామేశ్వరరావు, ముదిగొండ శంకరశాస్త్రి, టి.యస్. మూర్తి, వృక్షాల జగన్నాథం, టి. (తిరువరంగం) హయగ్రీవాచార్యులు, బత్తిని మొగిలయ్య, జమ్మలమడక పిచ్చయ్య, తిరుకోవలూరు రామానుజస్వామి, మద్దికాయల ఓంకార్, తిరునగరి వెంకటేశ్వర్లు, చిలుకమణ్ఱి రామానుజాచార్యులు, యం.యస్. ఆచార్య, దివ్వెల హనుమంతరావు, దెందుకూరి సోమేశ్వరావు, భండారు సదాశివరావు, తిరుకోవలూరు మనోహరస్వామి, నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు, భండారు చంద్రమౌళీశ్వరరావు, పి. (పరికిపాటి) ఉమారెడ్డి, జమ్మలమడక కృష్ణమూర్తి, నెమురుగొమ్ముల యతిరాజారావు, బి.ఆర్. భగవాన్‌దాస్, మహమ్మద్ నవాజ్ అలి, కోవెల సంపత్కుమారాచార్యులు, ముక్తవరపు శ్రీరాములు, తిరునగరి కృష్ణయ్య, డాక్టర్ రామక లక్ష్మణమూర్తి, రంగు చక్రపాణి, పరాంకుశం దామోదరస్వామి, మంథెన ఆండాళమ్మ, యం.వి. తిరుపతయ్య, వేముల పెరుమాళ్ళు, అష్టకాల నరసింహరామశర్మ, పొగాకు సుదర్శన్, యస్.యస్. చారి (సిద్ధోజు నరసింహాచారి), కె. రామమోహనరాజు, తక్కళ్ళ బాలరాజు, యం. రత్నాకరరావు, నమలికొండ బాలకిషన్‌రావు, కందాళ శోభారాణి వంటి స్ఫూర్తిమూర్తుల జీవిత రేఖలను సోదహరణంగా వివరించారు. గంటా జలంధరరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ దారి దీపాలు అన్న గ్రంథ ప్రత్యేకతను విశ్లేషిస్తే తెలంగాణ చలివెలుగు అన్న వ్యాసం కూడా పలువురు స్ఫూర్తిమూర్తులను గుర్తు చేసింది. ఎంతో శ్రమకోర్చి డాక్టర్ రంగస్వామి అందించిన ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తమైంది.
మన కాంతి పుంజాలు, రచన : డా. టి శ్రీరంగస్వామి. పుటలు 104, వెల రూ. 150/-, ప్రతులకు ఇంటి నెం. 27-14-53, ఓపిపి : ఎమ్మార్వో ఆఫీస్, శ్రీలేఖ కాలనీ హసన్‌పర్తి, హన్మకొండ జిల్లా, వరంగల్ – 506 371, తెలంగాణ రాష్టం.
సమీక్ష – డా. తిరునగరి శ్రీనివాస్ 8466053933















