EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అబుధాబిలో అంగరంగ వైభవంగా చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల శాంతియాత్ర

 

అబూదాబి జనవరి 21 (eetaram bharatam news)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబి నగరంలో చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న 100 దేశాలలో” శాంతి సద్భావనా ప్రపంచ యాత్ర” ఘనంగా జరిగింది.తెలుగు అసోసియేషన్ ఆఫ్ – అబుధాబి అధ్యక్షులు గంధం రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన  ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు. అబూదా బి లోని ఇండియన్ అంబాసిడర్ సంజయ్ సుధీర్ మాట్లాడుతూ చిగురుమళ్ళ 100 పుస్తకాలు రచించి 100 దేశాలలో శాంతి యాత్ర నిర్వహిస్తూ, మానవాళి ని చైతన్య పరచరడం అభినందనీయం అన్నారు.TAAD అధ్యక్షులు మాట్లాడుతూప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటటానికి సాహిత్యం తో సామాజిక చైతన్యం కలిగించడానికి శ్రీనివాస్  “వందే విశ్వమాతరమ్” పేరుతో వంద దేశాల శాంతి సద్భావనా యాత్ర నిర్వహించటం అభినందనీయమని అన్నారు.చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా మరియు 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతోతానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ మాతరం  ఛైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి సారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతోంది.నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికా ఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలోభాగంగా మధ్య ప్రాచ్యదేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నామని   మానవ  ప్రవర్తన లో పరివర్తన తీసుకురావడం సాహిత్యంతో  సాధ్యమవుతుందని అన్నారు.మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లుగా సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలోభాస్కర్ గుప్త, హరికృష్ణ,వెంకీ, నారాయణKDVS, ధనుంజయ్ , కృష్ణ కిషోర్,రవి, శ్రవన్ రెడ్డిల తో పాటు వందలాది మంది తెలుగు వారు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top