బెహ్రెయిన్, జనవరి 21 (eetaram bharatam news)
బెహ్రాయిన్ లో చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న 100 దేశాలలో శాంతి సద్భావనా ప్రపంచ యాత్ర ఘనంగా జరిగింది.తెలుగు కళా సమితి – బెహ్రాయిన్అధ్యక్షులు తక్కెళ్ళపాటి హరిబాబు, పూర్వ అధ్యక్షులు శివ యెల్లపుఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
బెహ్రాయిన్ లోని ఇండియన్ అంబాసిడర్వినోద్ కే జాకబ్ మాట్లాడుతూ 100 దేశాలలో శాంతి యాత్ర నిర్వహిస్తూ, మానవాళి ని చైతన్య పరచరడం అభినందనీయం అన్నారు.దీనిలో భాగంగా అమ్మ నాన్న గురువు శతకపద్యార్చన, మొక్కనాట వోయి ఒక్కటైన లాంటి కార్యక్రమాలు నిర్వహించడం భావి తరాలకు ఎంతో అవసరం, వీరి కృషి శ్లాఘనీయం అన్నారు.TKS అధ్యక్షులు మాట్లాడుతూప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటటానికి సాహిత్యం ద్వారా సామాజిక చైతన్య కలిగించడానికి శ్రీనివాస్ గారు “వందే విశ్వమాతరమ్” పేరుతో వంద దేశాల శాంతి సద్భావనా యాత్ర నిర్వహించటం అభినందనీయమని అన్నారు.
చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా మరియు 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ మాతరమ్ చైర్మన్జయశేఖర్ తాళ్ళూరిసారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతోంది.
నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికాఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలో* భాగంగా మధ్య ప్రాచ్య దేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నాము మానవ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం సాహిత్యం ద్వారా సాధ్యమవుతుందని అన్నారు.
మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లుగా సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు .ఆత్మీయ సమ్మేళనంలోఫణి భూషణరెడ్డి .టి, వంశీధర్. జి, ప్రవీణ్ సీ. హెచ్, ఫణి హనుమంతరావు, విజయేంద్ర రెడ్డి, రామ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి. సి తో పాటువందలాది మంది తెలుగు వారు పాల్గొన్నారు.















