EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాస్ ఆల్ ఖైమాలో ఘనంగా చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల శాంతియాత్ర

రాస్ ఆల్ ఖైమా, జనవరి 21 (eetaram bharatam news)

రాస్ ఆల్ ఖైమా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లో చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న 100 దేశాలలో శాంతి సద్భావనా ప్రపంచ యాత్ర ఘనంగా జరిగింది. తెలుగు తరంగిణి- ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.

తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకటసురేష్ మాట్లాడుతూ నూరు శతకాలకవినూరు చిగురుమళ్ళవిశ్వమానవ సౌభ్రాతృత్వాన్నిచాటటానికి సాహిత్యం ద్వారా సామాజిక చైతన్య కలిగించడానికి “వందే విశ్వమాతరమ్” పేరుతో వంద దేశాల శాంతి సద్భావనా యాత్ర నిర్వహించటం అభినందనీయమని అన్నారు.చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా మరియు 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో* *తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ  మాతరం  ఛైర్మన్ జయశేఖర్ తాళ్ళూరిసారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞంజరుగుతోంది.

నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికాఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలోభాగంగా మధ్య ప్రాచ్యదేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నాముమానవ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం సాహిత్యం ద్వారా సాధ్యమవుతుందని అన్నారు.మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లుగా సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు.ఈ కార్యక్రమంలోసురేఖ పట్నం, శ్రీనివాస రావు, రాజేష్ చామర్తి సత్యానంద డాక్టర్ వీర, కేదార్, డాక్టర్ రాఘవేంద్ర,ప్రసాద్, బ్రహ్మ విజయ్, శరత్ చంద్ర, సైదారెడ్డి, శివారెడ్డి, రామ శేషు, రవి, అనిల్కుమార్, వెంకట కళ్యాణ్ రావు, లక్ష్మణ్ రావు,  శివానందరెడ్డి, ఫ్లోరేన్స్విమల, వీరేంద్ర  తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top