21.1.2024ఖమ్మం బ్యూరో,నలుబోల మధులత.(,eetaram bharatam news)
ఈరోజు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కుటుంబ సమేతంగా మరియు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, టిపిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రం మేడారం సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారక్క జాతర కు దేశం నలుమూలల నుండి దాదాపు కోటి మందికి పైగా హాజరు అవుతారని, ఈ జాతర కార్యక్రమo వచ్చేనెల 21 నుండి ప్రారంభమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం మేడారం అభివృద్ధికి, జాతర సందర్భంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా సౌకర్యాలు భారీగా ఏర్పాటు చేసిందని, ఎన్నో మహిమలు కలిగిన చల్లని తల్లి తెలంగాణ వన దేవతను ప్రజలంతా సుఖ సంతోషాలతో,ఆరోగ్యంగా జీవించాలని, కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, జగన్నాథ రెడ్డి, బత్తుల వీరబాబు జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్, ఏపూరి మహేందర్, నల్లమోతు లక్ష్మయ్య,కొండాయి గూడెం మత్స్య శాఖ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, ఎల్ హెచ్ పి ఎస్ మండలాధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు బానోత్ నరసింహ నాయక్, చల్ల మల్లయ్య,జక్కంపూడి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.















