EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ముదిరాజులను బిసి ఈ గ్రూపు నుండి బిసి ఏ గ్రూపులోకి మార్చాలి      తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ డిమాండ్

హనుమకొండ జనవరి 22 (eetaram bharatam news); రాష్ట్రంలోనే ముదిరాజ్ బంధువులను ఏకతాటిపైకి తీసుకరావడం కోసం ఏర్పడిన వివిధ ముదిరాజ్ సంఘాలు ఏకతాటిపైకి రావాలని ముదిరాజ్ జేఏసీ అధ్యక్షులు పోల్కంటి లక్ష్మీనారాయణ ముదిరాజ్ పిలుపు నిచ్చారు. తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముదిరాజుల సమస్యలపై మరియు హక్కుల సాధనకై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో మొదటిసారిగా పత్రిక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో జేఏసీ అధ్యక్షులు పోల్కంటి లక్ష్మీనారాయణ ముదిరాజ్, కో కన్వీనర్ సుధాకర్, జేఏసీ జనరల్ సెక్రెటరీ వెంగళ సదానందం ముదిరాజు, రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మహిళ అధ్యక్షురాలు పుష్పలత ముదిరాజ్ ,, నీరజ ముదిరాజ్, మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోనే ముదిరాజ్ బంధువులను ఏకతాటిపై నిలపడం రాష్ట్రంలో ఏర్పడిన వివిధ ముదిరాజ్ సంఘాలను ఏకతాటిపై తీసుకురావడం రాజకీయం సాధించుటకై పల్లె పల్లెలోని గడపగడపకు ముదిరాజుల అందర్నీ ఏకం చేయటానికి ఆ రాష్ట్ర పర్యటనను పోరాటాల పురిటి గడ్డ అయినా వరంగల్ తో పాటు మిగతా తొమ్మిది జిల్లాలలో పర్యటించుటకు అందులో భాగంగా ఈరోజు ప్రపదమంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఈ ముదిరాజ్ చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం తో పాటు హనుమకొండ జిల్లా ముదిరాజ్ జేఏసీ అధ్యక్షులుగా వెంగళ విజయ్ ముదిరాజ్, , ఉపాధ్యక్షులుగా వెంగళ సహదేవ్ ముదిరాజ్,మరియు హనుమకొండ జిల్లా ముదిరాజ్ జేఏసీ యువత అధ్యక్షులుగా జి. అభిలాష్ ముదిరాజు,మరియు వారితోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.

ఎజెండాలోని ముఖ్యాంశాలు.

రాష్ట్ర ముదిరాజులను బిసి ఈ గ్రూపు నుండి బిసి ఏ గ్రూపులోకి మార్చాలని, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ను 5000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని ముదిరాజ్ కుటుంబాలకు ప్రభుత్వ భూములైన పోరంబోకు, కా రోజు ఖాతా గా మట్టిగుట్టల యందు పండ్ల తోటల పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని, రాష్ట్రంలోని ముదిరాజుల విద్య ఉద్యోగం అభివృద్ధికై యువత ఉపాధికై రాష్ట్ర రాజధాని హైదరాబాదు నందు ఐదు ఎకరాల స్థలం కేటాయించి వసతి గృహాలు కోచింగ్ సెంటర్లను అన్ని పోటీ పరీక్షల కై ముదిరాజ్ భవనాలను ఏర్పాటు చేయుటకై 100 కోట్లతో నిధులు కేటాయించాలని, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీహరి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా ప్రాతిపదికన 60 లక్షల జనాభాతో ముందు వరుసతో ఉన్నందున రాష్ట్ర ముదిరాజ్ మహిళలకు ఉపాధికై ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ముదిరాజ్ కులస్తులకు ఉచిత ప్రమాద బీమా కల్పించి చేయూతనివ్వాలని, ముదిరాజులను ప్రతి గ్రామంలో నూతన ముదిరాజ్ సంఘాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ముదిరాజ్ పౌరునికి ముదిరాజ్ సంఘాలలో సభ్యత్వాలు కల్పించాలని తీర్మానించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top