అమరావతి జనవరి 22 (eetaram bharatam news): అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్‌కు వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి. అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం, ఉద్యమంపై నిర్భంధం, తొలగింపునకు నిరసనగా రాష్ట్ర బంద్ చేపట్టినట్లు పలు సంఘాలు స్పష్టం చేశాయి. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా వామపక్షాలతో పాటు, కార్మిక సంఘాలు, ఉద్యమ సంఘాలు కూడా బంద్‌కు పిలుపునిచ్చాయి. కనీస వేతనం పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 42రోజుల నుంచి అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారని వివిధ సంఘాల నేతలు చెప్పారు. ఐదు సార్లు చర్చలు జరిపినా.. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించిందని సంఘాల నేతలు మండిపడ్డారు. సోమవారం ఛలో విజయవాడ కార్యక్రమంలో జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ బంద్‌కు సంఘాలు పిలుపునిచ్చాయి















