EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రామనామస్మరణతో మారుమ్రోగిన జియాగూడ

హైదరాబాద్ జనవరి 22 (eetaram bharatam news); అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవ వేడుకల నేపథ్యంలో జియాగూడ, పురానాపూల్, కుల్సుంపురా, రహీంపురా పరిసర ప్రాంతాలు రామనామస్మరణతో మారుమ్రోగాయి. జియాగూడలోని సమర్ధ నారాయణ ఆశ్రమం, కామధేను గోశాలలోని శ్రీసీతారామ దేవాలయంలో, జియాగూడ రంగనాథస్వామి దేవస్థానంలో, మహాంకాళి ఆలయం, ఇందిరానగర్ లోని వీరహనుమాన్ దేవాలయంతో పాటు ఇంకా పలు ఆలయాలలో, వాడ వాడల్లో శ్రీరాముడికి పూజలు నిర్వహించి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. జియాగూడ హనుమాన్గాంజ్లో విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ వారు నిర్వహించిన శ్రీరాముడి విజయోత్సవ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త, విరించి ఆసుపత్రి ఛైర్పర్సన్ మాధవీలత, జియాగూడ కార్పొరేటర్ బోహిని దర్శన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జియాగూడ మెయిన్రోడ్లో కార్పొరేటర్ బోహిని దర్శన్ నేతృత్వంలో భారీ ఎక్ఇడి స్క్రీన్ ఏర్పాటుచేసి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జియాగూడ డబుల్ బెడ్రూమ్ కాలనీలో శ్రీరాముడి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వాడ వాడలా శ్రీరాముడికి పూజలతో పాటు అన్నదానాలు, ప్రసాదాల వితరణ కార్యక్రమాలు జోరుగా సాగాయి.

 

Related News

Select the Topic
Scroll to Top