EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయి

హైదరాబాద్ జనవరి 23 (eetarambharatamnews);: ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని మంత్రి అన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని చెప్పుకొచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రెండో రోజు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top