హైదరాబాద్ జనవరి 23 (eetarambharatamnews);నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి మరియు హిందూ సామ్రాట్ బాల్ థాకరే 98 వ జయంతి వేడుకలు శివసేన పార్టీ ఆద్వర్యం లో కాచిగూడ మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్దగ్గర ఘనంగా నిర్వహించారు. దేశం కోసం ధర్మం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు బాల్ ఠాక్రే గారు చివరి శ్వాస వరకు పోరాడారు వారిని స్మరిస్తూ రోజు ఘనంగా ఇరువురి మహానుభావులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్ మాట్లాడుతూ నేటి యువత వారి అడుగుజాడల్లో నడవాలని వారి ఆశయాలను కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం అధికారం గా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో గౌటి గణేష్ శివసేన్ తెలంగాణ అధికార ప్రతినిధి మరియు తేజ శ్రీనివాస్ గోపాల్ వీరేష్ పద్మ ఆనంద్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు















