హైదరాబాద్ జనవరి 24 (EB news);ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ హెల్త్ క్యాంప్ ఇంచార్జ్ వీరమణి (ఎం. సీ మెంబర్ ) ఆధ్వర్యంలో యాకూత్ పుర లో, యాకుత్ మహల్ థియేటర్ దగ్గర , సీమ మహిళా మండలి సహకారం తో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగులకు, తెలంగాణ ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ (MMU) లో భాగంగా ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెలాక్సీ హాస్పిటల్ డాక్టర్ అమీర్ మెహది రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ యం సి సభ్యులు జ్యోతి,మెడికల్ హెల్త్ క్యాంప్ కన్వీనర్ డాక్టర్ శ్రీదేవి, గెలాక్సీ హాస్పిటల్ డా. అలీ, పార మెడికల్ డైరెక్టర్ హుసాముద్దీన్, బండ్ల గూడ మండల కన్వీనర్ రాకేష్, సీమ మహిళా మండలి సభ్యులు షామీమ్ సుల్తాన, సుల్తానా బేగం, అహ్మదీ బేగం, దొంతి శిల్పారెడ్డి, సుజాత లక్ష్మీ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.















