హైధరాబాద్ జనవరి 24 (EB news);అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న వేళ తెలంగాణలో ఎండోమెంట్ శాఖ నిర్వహించాల్సిన బాధ్యతలను పూర్తిగా విస్మరించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. బుదవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ సంప్రదాయం, సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎండోమెంట్ శాఖ విధులు నిర్వహించడంలో జరిగిన వైఫల్యాలను రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. మూసీ సుందరీకరణ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే అమలుకు నోచుకోని హామీలు వల్లెవేస్తోందని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లే నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు. మొదటి మాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి జరిగిన నిధుల చెల్లింపుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు, ప్రజలు తరలివచ్చారు.బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం కోసం ప్రపంచంలోని నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి అనేక దేశాల నుంచి భారతీయ సంస్కృతికి సంబంధించిన క్షేత్రాల నుంచి వస్త్రాలు, ఆభరణాలు, మట్టి పంపించారు.అయోధ్యలో జరిగిన ఆధ్యాత్మిక క్రతువు భారతీయ ఆత్మగౌరవానికి, హిందువుల మనోభావాలకు ప్రతీకగా జరిగింది.కాని, తెలంగాణ ప్రభుత్వంలోని ఎండోమెంట్ శాఖ అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు. హిందూ సంప్రదాయం, సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసింది.భారత రాజ్యాంగం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎండోమెంట్ శాఖ, మైనారిటీ వెల్ఫేర్ శాఖలు ఉన్నాయి.ఎండోమెంట్ శాఖకు కమీషనర్, మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వ్యవహారంలో అంతర్భాగంగా విధులు నిర్వహిస్తున్నారు.ప్రధాన పండుగలు, సందర్భాలు వచ్చినప్పుడు మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆ వర్గాలకు సంబంధించి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదేవిధంగా ఎండోమెంట్ శాఖ తమ విధులు నిర్వర్తించాలి.ఎండోమెంట్ శాఖ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎండోమెంట్ నిధులను ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు నిధులను ఖర్చు చేయడం సంప్రదాయమన్నారు.అయోధ్యలో మహత్తరమైన బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ, అధికార యంత్రాంగం సహాయ నిరాకరణకు పాల్పడ్డారు. పట్టింపు లేకుండా వ్యవహరించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన.హిందువుల కోసం, వారి మనోభావాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎండోమెంట్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం హేయనీయం.కుహనా లౌకికవాద కాంగ్రెస్ ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడంలో ఘోర వైఫల్యం చెందింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.హిందువుల ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరుకు తెలంగాణ ఎండోమెంట్ శాఖ మంత్రి క్షమాపణ చెప్పాలి.రాజ్యాంగబద్ధంగా ఎండోమెంట్ శాఖ విధులు నిర్వహించడంలో జరిగిన వైఫల్యాలను రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.నిన్న సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం వెనుక మతలబేంటి..?విదేశీ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ను పాతరేస్తానని మాట్లాడిన రేవంత్ ను అభినందించేందుకు కలిశారా..?కేసీఆర్ ను పరామర్శించేందుకు తన ఇంటికి కాంగ్రెస్ నాయకులు పరామర్శలకు క్యూలైన్లు కట్టారు. ఇది బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం.. అనుబంధం.. సంబంధం.కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని సుందరీకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పింది. గతంలో కేసీఆర్ సైతం ట్యాంక్ బండ్ ను కొబ్బరినీళ్లతో నింపుతామని మాటలు చెప్పారు.పదేళ్లు గడిచినా ట్యాంక్ బండ్ లో కొబ్బరినీళ్లలా చేసింది లేదు. మూసీ సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ వ్యవహరిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది కాంట్రాక్టర్లే.బ్యాంకు రుణాల ద్వారా ప్రాజెక్టులు చేపట్టి అందింనంత మేరకు దండుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. బీఆర్ఎస్ పంథాలోనే కాంగ్రెస్ పయనిస్తోంది.ఇప్పటికే అప్పుల్లో మునిగిన రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు కోసం కొత్తగా అప్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆగిన కాంట్రాక్టర్ల బకాయిలు, ఆగిన బిల్లులను మొదటి మాసంలో చెల్లించింది.మొదటి మాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి జరిగిన నిధుల చెల్లింపుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసారు.















