EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు తీవ్రస్థాయిలో మండిపడ్డ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

న్యూఢిల్లీ జనవరి 25 (EB news)దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పెంపొందించారని, కాబినెట్‌లో కూడా మతాన్ని రాజకీయం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ సందర్భంగా గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏ రాజ్యాంగానికి లోబడి ఎన్నికయ్యారో దానికి మూడు నామాలు పెట్టారని, మతం, రాజకీయం ఒకటి చేశారని ఆరోపించారు. అయోధ్య రామాలయం నిర్మాణంకు తాము వ్యతిరేకం కాదని, అన్ని ఊర్లలో రామాలయాలు ఉన్నాయన్నారు. అయోధ్యలో ఒక ఈవెంట్ లాగా రామాలయంను మోదీ, యోగి ఓపెనింగ్ చేశారని విమర్శించారు.బాబ్రీ మసీదు ఘటనలో అద్వానీ ఉన్నారని, అలాంటి అద్వానీ రామాలయం ప్రారంభోత్సవానికి రాలేదని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని నారాయణ విమర్శించారు. ప్రపంచం మొత్తం బాబ్రీ మసీదు కులగొట్టిన అంశాన్ని చూశారని, అయోధ్య తీర్పు ఇచ్చిన వారిలో ఒకరు రాజ్యసభలో, మరొకరు ఏపీ గవర్నర్‌గా ఉన్నారన్నారు. అయోధ్య రామాలయం ప్రారంభానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా విశాలంగా ఆలోచన చేయాలన్నారు. మోదీ బ్లాక్ మెయిల్‌తో కొందరు వెనక్కి వెళ్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇంకా అందరినీ కలుపుకొని పోవాలని అన్నారు

 

Related News

Select the Topic
Scroll to Top