EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జీవో 55ను రద్దు చేయాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముట్టడికి ఏబీవీపీ యత్నం           రణరంగంగా మారిన రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ          జుట్టు పట్టి ఈడ్చిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్

హైదరాబాద్, జనవరి 25 (EB news);: నగరంలోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ముట్టడికి ఏబీవీపీ యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ 100 ఎకరాల ల్యాండ్‌ను హైకోర్టు నూతన భవనానికి కేటాయించడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవో 55ను రద్దు చేయాలని ఏబీవీపీ సైతం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో యూనివర్సిటీ వంద ఎకరాల ల్యాండ్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.యూనివర్సిటీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. దీంతో వారు అడ్మిన్ బ్లాక్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. నిన్న ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సిని జుట్టు పట్టి ఈడ్చిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్‌ను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పరిశోధనకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయని.. కావున ఆ భూములను తీసుకోవద్దంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

యూనివర్సిటీలో అమానవీయ ఘటన

అయితే యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ.. జీవో నెంబర్ 55ను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. నిన్న (బుధవారం) శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో మహిళా ఏబీవీపీ కార్యదర్శి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సంచలనం రేపుతోంది. ఆందోళన చేస్తున్న మహిళా కార్యకర్తను.. బైక్‌పై వెళ్తున్న ఓ మహిళా పోలీసు జుట్టుపట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో సదరు కార్యకర్త కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top