EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉత్తమ అధికారులుగా దూడల వెంకటేశ్, రావి హరి నాథ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జనవరి 25(Ebnews)ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దూడల వెంకటేష్, రావి హరినాథ్ రెడ్డిలు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఎన్నికల శిక్షణలలో మరియు రకరకాల ఎన్నికల విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఉత్తమ అధికారులుగా జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే, అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వీరారెడ్డి, డిసిపి రాజేష్ కుమార్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ గౌరవం రావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామసుందరి ఉపాధ్యాయులు శేఖర్, మంద సోమరాజు, కాజా ఆలీ, సాంబశివ, నవీన్ కుమార్, స్వర్ణలత, లక్ష్మమ్మ, కవిత, విజయలక్ష్మి, మీరా, రవి, వేణు మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ మిత్రులు అభినందనలు తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top