26.1.2026 ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)
75 వ గణతంత్రదినోత్సవాన్ని వీర నారి సావిత్రి బాయి పూలే మహిళా సంఘం ఈరోజు ఘనంగా నిర్వహించింది.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పి ఆర్ దేవిఅధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా లెక్చరర్ విజయలక్ష్మి గారు పాల్గొని జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మహిళా జర్నలిస్ట్ మధులత. మరియు అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలందరూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగంలో మహిళలకు కల్పించినటువంటి హక్కులను, అవకాశాలను వాడుకొని మహిళలు విజయతీరాలను చేరాలని అన్నారు. వివిధ సందర్భాలలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు మహిళ లోకం తిప్పి కొట్టాలని ఇందుకు ప్రతి ఒక్కరు రాజ్యాంగంలో మహిళలకు ఇచ్చినటువంటి హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎందరో మహిళలు సమాజంలో చైతన్యం తేవడానికి కృషి చేశారని అటువంటి మహిళల స్ఫూర్తి తోటి వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం కృషి చేస్తుందని అన్నారు. రాజ్యాంగ రచనలో కూడా మహిళల పాత్ర ఉందని సమాజంలో తమ వంతు కృషి మహిళలుగా సమాజాభివృద్ధికి ఎప్పటికప్పుడు మహిళలు నిర్వర్తించారని ఆమె గుర్తు చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి భూక్యఉపేంద్ర, ఉపాధ్యక్షురాళ్లు కామన అనంతలక్ష్మి, భూక్యమణి, చాట్ల సునీత సహాయ కార్యదర్శి ఇనపనూరి నాగలక్ష్మి, తిప్పర్తి రమ్య, మరియు సభ్యులు బానోతు జ్యోతి ,.పగిళ్ల లక్ష్మి ,ఉండవల్లి లక్ష్మి విజయ,విజయ దుర్గ భవాని చిన్నారి జియాన్షితదితరులు పాల్గొన్నారు.















