అమరావతి జనవరి 27 (ఈ బీ న్యూ స్);: అప్రజాస్వామిక విధానాలు, నియంత్రత్వ పోకడలు నచ్చకే వైసీపీ కి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. ఆయనకు శాసన మండలి శనివారం నాడు నోటీసులు పంపించింది. నోటీసులు పంపించడంపై రామచంద్రయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీకు రాజీనామా చేయడంపై వివరణ ఇవ్వాలని ఈనెల 8వ తేదీన శాసన మండలి నుంచీ నాకు నోటీసులు అందాయి. నా సతీమణి ఆరోగ్య పరిస్థితి బాగోనందున, నోటీసులపై స్పందించడానికి నాలుగు వారాల వ్యవధి కావాలన్నాను. నాకు సమయం ఇవ్వకుండా, నా వివరణ కోరకుండా.. చర్యలకు ఉపక్రమించడం అన్యాయం.. రాజ్యాంగ విరుద్దం. ఎమ్మెల్సీగా నేను వైసీపీకి విధేయుడినై ఉండాలా.. రాజ్యాంగానికి బద్ధుడినై ఉండాలా? ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పరిపాలనలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా’’ అని ఎమ్మెల్సీ రామచంద్రయ్య మండిపడ్డారు.















