28.1.2024ఖమ్మం బ్యూరో నలుబోల మధులత.(ఈ బీ న్యూస్)
కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన మత్స్య శాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు – నాగలక్ష్మిల మనవరాలైన చి. పర్ణిక మరియు ధర్మ సోత్ నాగేశ్వరరావు – పార్వతిల కుమారుడు చి, తారక రామ్ పుట్టు వెంట్రుకలు తీయు వేడుకలు పండితాపురం బస్టాండ్ లో వేర్వేరు ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్లు నాగ సీతారాములు, పుచ్చకాయల వీరభద్రం, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, పులిగండ్ల మాధవరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్, ఏపూరి మహేందర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యువజన అధ్యక్షుడు చిత్తారి సింహాద్రి యాదవ్, దుబాకుల శ్రీనివాస్ లు పాల్గొని అక్షింతలు వేసి చిరంజీవి పర్ణికను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పర్ణిక తల్లిదండ్రులు మేకల లక్ష్మీనారాయణ, శ్రీవిద్య దంపతులు అతిథులకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు. రాజకీయ ప్రముఖులు మరియు బంధువులతోపాటు గ్రామ ప్రజలందరూ విచ్చేసిన ఈ కార్యక్రమం వివాహ వేడుకను తలపించింది. డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి, అందరికీ దగ్గరుండి కార్యక్రమం ఏర్పాట్లను చూశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతిపరులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.















