సీసీఐ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షునిగా మామిడి భీమిరెడ్డి
హైదరాబాద్ జనవరి 29 (ఈ బీ న్యూ స్);జాతీయ వినియోగదారుల సమన్వయ సమాఖ్య (సీసీఐ) తెలంగాణ రాష్ట్రము నకు వర్కింగ్ కమిటీ అధ్యక్షునిగా మామిడి భీమిరెడ్డి నియమితులైనారు.మాసబ్ ట్యాంక్ వద్దగల రెడ్ క్రాస్ భవనము లో జాతీయ వినియోగదారుల సమన్వయ సమాఖ్య సీసీఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేషం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ వినియోగదారుల సమన్వయ సమాఖ్య జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రీతి పాండ్యన్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈససమావేశమునకు హాజరై సభ్యులు తీసుకున్న పక్కా అభిప్రాయ తీర్మానం మేరకు ప్రీతి పాండ్యస్ గారిని నియమించారు.ఈ సందర్బంగా ప్రసంగిస్తూ సభ్యత్వము పొందిన వారికి మరియు రెడ్ క్రాస్ సంస్థ సీసీఐ సమన్వయముగా 29, 30 తేదీలలో వివిధ చట్టాలపై కల్తీలు కనుగొనుట మరియు నష్టం జరిగిన వినియోగదారుడు ఎక్కడ ఫిర్యాదు చేయాలి, నష్టపరిహారం ఏ విధంగా పొందాలి అనే అంశాలపై సుమారు 100 మంది శిక్షణ పొంది గ్రామీణ వినియోగదారులను వీరు చైతన్యము కలగజేస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారుల సంఘాల నాయకులు హాజరై వారి అభిప్రాయములు తెలిపారు.సమావేశంలో జాతీయ సీసీఐ ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు, తమిళనాడు నుండి సీసీఐ సీనియర్ జనరల్ సెక్రటరీ సెల్వరాజ్, సిసిఐ నేషనల్ జాయింట్ సెక్రటరీ నాగరాజు, సీసీఐ సీనియర్ జాయింట్ సెక్రటరీ శివపార్వతి, క్యాట్కో చైర్మన్ శంకర్ లాల్ చౌరాసియా, జాయింట్ సెక్రెటరీ విశ్వనాధర రాజు, సిసిఐ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కొంతం వీరాస్వామి, సుజాత, నర్సింహారెడ్డి, ఐజాక్ రాజు, అరబు రాథోడ్, శిల్పారెడ్డి, సుప్రభా తదితరులు పాల్గొన్నారు.















