EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అరాచక శక్తులకు కొమ్ము కాస్తున్న టెక్కలి డిఎస్పీ చర్యలు తీసుకోవాలి ఐహెచ్అర్ఏ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్

అమరావతి జనవరి 29 (ఈ బీ న్యూ స్);: అరాచక శక్తులు, గుండాలు కొమ్ము కాస్తున్న టెక్కలి డిఎస్పీ బాలచంద్ర రెడ్డి పై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేసారు. శ్రీకాకుళం జిల్లా, హిరమండలం మండలం, రుగడ సదేవాలయం పరిధిలో యున్న యమ్. అవిలింగి గ్రామములో గత 20 సంవత్సరాలు నుండి హక్కు అనుభములో యున్న కొండ ఆదివాసి గిరిజనులు రాహుల్ పెగైరా తాలూకా భూమిపై కన్నువేసి, ఆక్రమించడానికి దౌర్జన్యం చేసిన పదాల రఘు వగైరా ఆరావక శక్తుల గుండాలపై యస్.పి. అట్రాసిటీ కేసు నమోదు వేసి తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నాయుడు డిమాండు చేస్తున్నది.

ఈ నెల 25న యమ్.ఆవలింగి గ్రామములో మధ్యాహ్నాం 4-00 గంటలు సమ యంల ఆదివాసీలు గిరిజనులుపై భయంకరమైన దాడులు చేసి అడవారిని కూడా జుట్టుపట్టి ఈడ్చి పిల్లలు ఉన్నారని కూడా మాడకుండా వంటిపిల్లల తల్లులను దారుణంగా కొట్టి హింసించి మరియు తక్షణమే గ్రామం వదిలి వెళ్లిపోవాలని బెదిరించిన ఆరావక శక్తి పడాల రఘు వగైరా 25 మందిపై క్రిమినల్ కేసు సమాదు వేసి తగుచర్యలు తీసుకోవాలని కొండ ఆదివాళి గిరిజనులకు తగు భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. గత 20 సంవత్సములు నుండి వారి హక్కు అనుభములో వున్న భూమిని రెవిన్యూ అధికారులు, రెవిన్యూ రికార్డులను బెంపరింగు వేసి అధిక మొత్తములో లంచం తీసుకొని గత మూడు సంవత్సరములు క్రింద అప్పటి హిరమండల రెవిన్యూ తహశీల్దారు పాసుపుస్తకములు పడాల రఘు అనే అసామికి మంజూరు చేయడం వెనక పెద్ద కుట్ర ఉన్నదని ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడినందున భూములు ధరలు పెరిగినందున పడాల రఘ వగైరా ఎ. 3-40 సెంట్లు భూమిని కాజేయుటకు ప్రయత్నిస్తున్నట్లు ఈ క్రమంలో వారిపై దాడులు చేసారని వారిని చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో కూడా పడాల రఘ వగైరాల మీద బైండవరు కేసులు ఉన్నాయని కాబట్టి పై అంశములు అన్ని పరిగణలోనికి తీసుకొని ఇంతవరకు ఎటుంటి చర్యలు తీసుకోకుండా ఉన్న క్రింద స్థాయి పోలీస్ అధికారులపై తగుచర్యలు తీసుకొని గౌరవ జిల్లా సూపరెండెంటుకు తగు ఆదేశాలు జారీచేసి గిరిజనుల ప్రాథమిక హక్కులు, వారి జీవన బృతిని కాపాడాలని విజ్ఞప్తి చేసారు.వెంటనీ నిందితులను అరెస్ట్ చేయాలని లేని పక్షం లో కేంద్ర హోమ్ శాఖా మంత్రికి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా, కలెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేట్ స్పందనలో పిర్యాదు చేసినట్లు తెలిపారు

.

 

Related News

Select the Topic
Scroll to Top