EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మన జీవితాలనుంచి ప్లాస్టిక్ ను దూరం చేద్దాం         ప్రముఖ కవి గాయకుడు జయరాజ్ పిలుపు

మేడ్చల్ జనవరి 29 (ఈ బీ న్యూ స్);మన జీవితం నుండి ప్లాస్టిక్ ని దూరం చేద్దామని ప్రముఖ కవి గాయకుడు జయరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం కుషాయిగూడ చక్రిపురం లో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజలు ప్లాస్టిక్ ని వాడుతున్నారని తద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. ప్లాస్టిక్ మన జీవితం లో ఉదయం పాల పాకెట్ తో మొదలైన రాత్రి భోజనం ప్యాకెట్ తో ముగుస్తుంది అని తెలిపారు. ఈ విధంగా మనం అన్నం తినే ఇస్తరాకు దగ్గర నుంచి మంచినీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాస్ వరకు ప్లాస్టిక్ ని నిత్యం వాడుతున్నామని వివరించారు. ఇదే విధానం కొనసాగితే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.ఈ విధంగా మన జీవన విధానం ఉంటే భవిష్యత్తులో మంచి నీరు, మంచి గాలి మనకి దొరకటం అసాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టెప్ ఆర్గనైజర్ ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ద్వారా వచ్చే నష్టాలు, రోగాలను వివరించారు. త్వరలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గతంలో ఈ ప్లాస్టిక్ లేకుండా ప్రజలు ఎంతో ఆనందంగా జీవనాన్ని గడిపారని, ప్రజలు ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం వల్ల క్లాత్ బ్యాగులు, జ్యూట్ బ్యాగులు ప్రత్యామ్నాయంగా వాడకంలోకి వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టెప్ ఆర్గనైజర్లు గుమ్మడి హరిప్రసాద్, రంగన్న, గురు ప్రసాద్, జర్నలిస్టులు దొమ్మాడి కిరణ్ కుమార్, డి శ్రీనివాసరావు, ఇంద్రపాల సత్యనారాయణ, బి శాంతి బాబు తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top