29.1.2024 ఖమ్మం బ్యూరో నలుబోల మధులత(ఈ బీ న్యూస్)
తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ- 2024 గౌరవ డిప్యూటీ సీఎం మరియు ఎనర్జీ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్లు విద్యుత్ శాఖకి సంబందించిన సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
1.టీఎస్ జెన్కో,టీ ఎస్ ట్రాన్స్కో,టీ ఎస్ ఎన్ పి డి సి ఎల్, టీ ఎస్ ఎస్ పి డి సి యల్ కంపెనీ లలో అర్హత ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్స్ కు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పదోన్నతులు ఇవ్వడం గురించి.
2) కేటీపీస్ 7 వ దశ ప్లాంట్ ఎంప్లాయిస్ 50 సంవత్సరాలు దాటినా నివాస్యోగానికి అనుకూలము గా లేని క్వార్టర్ లో ఉంటున్నారు,పాత క్వార్టర్స్ స్థలము లో కొత్త క్వార్టర్స్ నిర్మించాలని
3 పదవి విరమణ వయస్సు పునఃసమీక్షించాలని
4. నూతన అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్, ఏఇ ల సీనియార్టీ, పునరుత్పదక విద్యుత్ ప్రోత్సహించడం వంటి పలు అంశాలపై వినతి పత్రం అందించారు. డిప్యూటీ సీఎం గారు సానుకూలంగా స్పందించి ఎనర్జీ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని నోట్ చేసి చర్చించమని చెప్పడం జరిగినది.
ఈ డైరీఆవిష్కరణ కార్య క్రమంలో అధ్యక్షులు ఎన్నెట్ల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బట్టు హరీష్, ట్రాన్స్కో అధ్యక్షులు యాదగిరి, జెన్కో అధ్యక్షులు నరోత్తమ్ కుమార్, వెల్ఫేర్ సెక్రటరీ వెంకన్న, మహిళా ప్రతినిధి ప్రియాంక,రజనీకర్,అనిల్ రెడ్డి,సతీష్ రాజా మరియు వివిధ కంపెనీలకి సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్లు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.















