30.1.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ….సత్యం,అహింస అనే ఆదర్శాలను ఆయుధాలుగా చేసుకున్న మహనీయుని జీవితం సందేశం మనందరికి దిక్సూచి అన్నారు.అదేవిధంగా అహింసవాదంతో వలసదాడుల చేరనుండి అఖండ భారతవానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యన్ని అందించి పోరాట మార్గాన్ని చూపిన శాంతి దూత జాతిపిత మహాత్మా గాంధీ గారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరావు,INTUC రాష్ట్ర నాయకులు జలీల్,నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వహక అద్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,జిల్లా INTUC,OBC, మైనారిటీ, సేవాదళ్ అద్యక్షులు కొత్తా సీతారాములు,పుచ్చకాయల వీరభద్రం, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, సయ్యద్ గౌస్, కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు, మిక్కిలినేని మంజుల, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినేని రమేష్,గడ్డం వెంకటయ్య, తవిడబోయిన రవి, కృష్ణయ్య, షేక్ అబ్దుల్ రహమాన్, నల్లమోతు రవి, ఏపూరి మల్లిఖార్జునరావు, గాదర్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.















