EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సిఎం హేమంత్‌ సోరెన్‌ కనిపెట్టి సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు జార్ఖండ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ కీలక ప్రకటన

జార్ఖండ్‌ జనవరి 30 (ఈ బీ న్యూ స్):మనీలాండరింగ్‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ గత మూడు రోజుల నుంచి కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. సీఎంను కనిపెట్టి సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ప్రకటించారు. రూ.11,000 బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోరెన్‌ ‘మిస్సింగ్‌’ అంటూ పోస్టర్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు.ప్రభుత్వ భూముల యాజమాన్యం మార్పు కుంభకోణంలో రూ.600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సొరేన్‌కు ఈడీ అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 27న కూడా ఈడీ.. సోరెన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 29న గానీ, 31న గానీ అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందన తెలియజేయాలని పేర్కొంది. అయితే, ఆయన 27వ తేదీన రాత్రి నుంచే అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటి వరకూ సోరెన్‌ ఆచూకీ తెలియరాలేదు. అతన్ని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, సీఎం సోరెన్‌ పరారయ్యాడంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top