EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గన్నవరం వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం      సురక్షితంగా బయటపడ్డ చంద్రబాబు సతీమణి

గ న్నవరం జనవరి 30 (ఈ బీ న్యూస్ న్యూస్ ):గన్నవరం వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో వీల్‌ తెరుచుకోలేదు. దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.హైదరాబాద్‌ నుంచి గన్నవరం వెళ్లిన విమానం.. ల్యాండ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి వచ్చింది. అయితే, ఆ సమయంలో విమానం వీల్‌ తెరుచుకోలేదు. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే టేకాఫ్‌ చేశారు. ఈ ఘటనతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సుమారు 20 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వీల్‌ తెరుచుకోవడంతో సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ విమానంలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నట్లు సమాచారం.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top