31.1.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత(ఈ బీ న్యూస్)ప్రజా యుద్ధ నౌక ప్రముఖ ప్రజా విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ 76వ జయంతి ఉత్సవాన్ని వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు పి ఆర్ దేవి మాట్లాడుతూ గద్దర్ సమాజంలో సామాజిక చైతన్యానికి, విప్లవగళంగా సమాజంలో జరుగుతున్న సమాజంలో జరుగుతున్న అనేక విధమైన నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా గళం విప్పిన మహాయోధుడని నక్సల్ బరి ఉద్యమం వైపు పయనించి గన్నుతోనే రాజ్యం సాధించాలని అనుకున్న తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా రాజ్యాధికారం ఓటు , కలం తోటే సాధ్యమవుతుందని తన దిశను మార్చుకొని రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రాజ్యాధికారమే మాస్టర్ కి ద్వారా ప్రజలలో చైతన్య తెచ్చిన మహావీరుడు ఆయన నేటి తరానికి అనుసరణీయుడని ఆమె అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అన్న పాత్ర చాలా ప్రాముఖ్యతతో ఉన్నదని ఆయన పాడిన ప్రతిపాట ప్రతి పల్లె పాట అని గడపగడపకు ఆయన పాట వెళ్లిందని ఆ పాట స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమం రూతలూగిందని అటువంటి గొప్ప మహనీయుని కాలంలో మనం జన్మించి ఉండటం మన అదృష్టవంతులం అని అన్నారు గద్దర్ చూపిన బాటలో పైనుంచి ఆయన ఆశయాలను నెరవేర్చుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి భూక్య ఉపేంద్ర, మహిళ సంఘం ఉపాధ్యక్షులు అనంతలక్ష్మి, చాట్ల సునీత తదితరులు పాల్గొన్నారు.















