EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెక్యూరిటీని తగ్గించడంపై రఘువీరారెడ్డి ఆగ్రహం

విజయవాడ, జనవరి 31 (ఈ బీ న్యూస్ );: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తొలుత 4+4 గా ఉండే భద్రతను ఆ తరువాత 2+2కు తగ్గించారని కాంగ్రెస్ పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఆ భద్రతను 1+1 కు తగ్గించారని తెలిపింది. అయితే తనకు భద్రత పెంచాలని జనవరి 22న ఏపీ డీజీపీకి షర్మిల లేఖ రాశారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత తగ్గించడంపై ‘‘ఎక్స్’’ వేదికగా రఘువీరా ట్వీట్ చేశారు.

‘‘ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి 4+4 సెక్యూరిటీ కలిగి ఉండే వారు. ప్రజాక్షేత్రంలో చురుకుగా ఉన్న ఈ తరుణంలో 2+2 కు తగ్గించారు. ఇప్పుడు మరలా 1+1కు తగ్గించారు. కార్యకర్తల సమావేశాల నిమ్మిత్తం మేము రాష్ట్రముంతా తిరిగినప్పుడు.. ఎన్నికల తరుణంలో, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం నేను గమనించాను. కాబట్టి అత్యవసరంగా, తక్షణం షర్మిల కోరిన విధంగా 4+4 సెక్యూరిటీ… ఎస్కార్ట్ వాహన సౌకర్యం కల్పించగలరు’’ అంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ని ఉద్దేశించి రఘువీరా రెడ్డి ట్వీట్ చేశారు.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top