EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రాచీన పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం తో ఆరోగ్యకరమైన నవ సమాజ నిర్మిద్దాం ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పిలుపు

ఆలేరు జనవరి 31 (ఈ బీ న్యూ స్);సేంద్రియ వ్యవసాయం ప్రాచీన పద్ధతిలో రైతులతో చేయించి ఆరోగ్యకరమైన నవ సమాజ నిర్మించాలని ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పిలుపు నిచ్చారు. ఆలేరు నియోజకవర్గం వంగపల్లి రైతు వేదికలో రైతు సంక్షేమ సేవా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగ బీర్ల ఐలయ్య విచ్చేసి ప్రసంగించారు. ప్రతి నియోజకవర్గంలో రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి గో ఆధార్ వ్యవసాయం ఫస్ట్ సంపద పెంచుకొని చేయాలని చుచించారు. ప్రతి ఊర్లో వన సంరక్షణ గురించి పండ్ల చెట్లను పెంచాలని భూమి సారము తగ్గిపోయింది కాబట్టి భూమిని సారవంతం చేయాలని మంచి ఆరోగ్యకరమైన పూర్వికులు ఏ పంటలు పండించారన్నారు. సేంద్రియ వ్యవసాయం ప్రాచీన పద్ధతిలో పంటలకు ప్రోత్సహిస్తూ పండించాలని సమావేశం లో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో రైతు సంక్షేమ సేవా సంఘం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్తాపక అద్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమం లో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి , కే మహేందర్ నాయక్, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఎబినైజర్, శ్రీశైలం కురుమ, వంగాల అశోక్ గౌడ్, బి ఆంజనేయులు, మద్ది ఆగమయ్య, బి విశ్వనాథ్, ఆర్ పద్మ, ఎన్ బాలరాజ్ యాదవ్, డాక్టర్ డానియల్ మరియు నియోజకవర్గంలోని సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు అన్నదాత రైతులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని సేంద్రియ వ్యవసాయానీ ప్రోత్స హించాలని ముక్త కటమ్ తో నినదించారు

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top