న్యూ డిల్లీ ఫిబ్రవరి 1 (ఈ బీ న్యూ స్);కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్ర బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు.
బడ్జెట్‌లో వివిద శాఖలు.. పథకాలకు కేటాయింపుల ఇలా..
మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
రైల్వేశాఖకు రూ.2.55లక్షల కోట్లు
హోంశాఖకు రూ.2.03లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
కమ్యూనికేషన్ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు
సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు రూ.8500కోట్లు
గ్రీన్ హైడ్రోజన్‌కు రూ.600కోట్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ 2024-25ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. రుణేతర ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉండొచ్చని, నికర రుణాలు రూ. 11.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరిచేలా కృషి చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆహార సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్పారు. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని తెలిపారు. ప్రాథమిక అవసరాలు నెరవేరాయని, దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం పెరిగిందని తెలిపారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రకటించారు. ప్రజలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, అవినీతి, బంధుప్రీతిని అంతం చేశామని చెప్పారు.
మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోంది. మా దేశం యువత ఆకాంక్షలు ఉన్నతమైనవి, వర్తమానంలో ఉజ్వల భవిష్యత్తుపై ఆశ విశ్వాసం కల్గి ఉన్నారు. గత 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో అపూర్వమైన మార్పు వచ్చింది. 2014లో దేశం పెద్ద సవాళ్లను ఎదుర్కొంది. ప్రభుత్వం ఆ సవాళ్లను అధిగమించి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టింది. ప్రజాహిత సంస్కరణలు అమలు చేశామని నిర్మలా అన్నారు.
బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందన్నారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయని చెప్పారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు ఆశగా, ఆశావాదంతో చూస్తున్నారన్న ఆమె.. ప్రజల ఆశీర్వాదంతో 2014లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ మంత్రంతో దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేసుకున్నారు. ఆ సవాళ్లను సీరియస్‌గా తీసుకున్న మోదీ ప్రభుత్వం.. వాటిని సమర్థవంతంగా అధిగమించిందని వెల్లడించారు.
ఇంకా ఏమన్నారంటే..?
‘మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందరికీ ఇల్లు, ఇంటింటికి నీరు, బ్యాంకు ఖాతా, ఆర్థిక సేవలు అందిస్తున్నాం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం. తద్వారా ఆహార సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. రైతులకు మద్దతు ధర పెంచాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేశాం. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాం. పేదలు, మహిళలు, యువత, రైతులపై ప్రత్యేక దృష్టి సారించాం. అందరినీ కలుపుకొని సమ్మిళిత అభివృద్ధికి కృషి కొనసాగుతోంది..’ అని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మా ప్రభుత్వం పారదర్శక పాలనపై దృష్టి సారించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని నిర్మల తెలిపారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని గుర్తు చేశారు.
రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని నిర్మల వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను త్వరలోనే నిజం చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, అందరికీ వంటగ్యాస్, అందరికీ బ్యాంకు ఖాతాల ద్వారా ప్రతి ఇల్లు, వ్యక్తి లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు రికార్డు సమయంలో చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి వేగవంతమవుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి వేగవంతమవుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో టైర్ 2, టైర్ 3 నగరాలను విమానాల ద్వారా అనుసంధానిస్తామని తెలిపారు. దీంతోపాటు లక్షద్వీప్‌లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని అన్నారు.
భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లే ద్వీప సమూహ దేశమైన మాల్దీవులతో దౌత్యపరమైన వివాదం తర్వాత చాలా మంది భారతీయులు లక్షద్వీప్‌ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా చూస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో పర్యాటక రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు. 75 వేల కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా ఇచ్చామని ప్రస్తావించారు. ఎఫ్‌డీఐలు కూడా 2014 నుంచి 2023కి భారీగా పెరిగాయని అన్నారు.
జీవ ఇంధనం కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజా రవాణా కోసం ఈ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. రైల్వే సముద్ర మార్గాన్ని అనుసంధానం చేయడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పూర్తి బడ్జెట్ జూలైలో వస్తుందని నిర్మల వెల్లడించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఇందులో ప్రదర్శించనున్నారు. మౌలిక సదుపాయాల కోసం 11 శాతం ఎక్కువగా ఖర్చు చేయనున్నారు. జనాభా పెరుగుదలపై కమిటీని ఏర్పాటు చేశారు.
58 నిమిషాలు ప్రసంగించిన నిర్మలా సీతారామన్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను (Union Budget) గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 58 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఇంతవరకూ ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లతో పోల్చుకుంటే అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించడం ఇదే ప్రథమం. ఒక రకంగా చెప్పుకుంటే.. మునుపటి ప్రసంగాలు, బడ్జెట్‌తో పోలిస్తే.. నిర్మలమ్మ బడ్జెట్ రికార్డ్ బ్రేక్ అని నిపుణులు చెబుతున్న పరిస్థితి.
నిర్మలా సీతారామన్ గత ప్రసంగాలను పరిశీలిస్తే, 2019లో 137 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగించారు. 2020లో 162 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. 2023లో 87 నిమిషాల పాటు ఆమె ప్రసంగం సాగింది. ఈసారి (2024) తాత్కాలిక బడ్జెట్ కావడంతో 58 నిమిషాలతో ప్రసంగం ముగిసింది. 2019 జూలై నుంచి ఐదు సార్లు పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను ఆమె అధిగమించారు.















