EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఐపిఒడభ్ల్యూ జాతీయ కన్వీనర్ గా సంపంగి పద్మ ఎన్నిక. మూడు విప్లవ మహిళా సంఘాలు విలీనంతెలంగాణ ఐపిఓడభ్ల్యూ నూతన కమిటీ కార్యదర్శిగా పెర్క సునీత

హైదరాబాద్ ఫిబ్రవరి 1 (ఈ బీ న్యూ స్); ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న మనువాద బ్రాహ్మణీయ పాలకవర్గం అభివ్రుద్ది చెందిన ఆధునిక సమాజాన్ని ద్వంసంచేసి, తిరిగి పాత బానిస సమాజంలోకి స్త్రీలను నెట్టివేసే కుట్రలకు వ్యతిరేకంగా శ్రామిక మహిళా లోకం సంఘటితంగా ఉద్యమించాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ పిలుపునిచ్చారు. గురువారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్, మేడ్చల్ లో మూడు విప్లవ మహిళా సంఘాల ప్రతినిధుల సభ జరిగింది. పీఓడభ్ల్యూ(విముక్తి) ఎం.పుణ్యవతి, పీఓడభ్ల్యూ(స్త్రీ విముక్తి-రాంచంద్రన్), బి.పావనీ, అఖిల భారత విప్లవ మహిళా సంఘం సంపంగి పద్మ ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అథితిగా హాజరైన మల్లెపల్లి ప్రభాకర్ ప్రసంగించారు. స్త్రీలను మళ్ళా వంటింటికి, పిల్లలను కనే యంత్రాలుగా మార్చెందుకు మతం ముసుగులో జరుగుతున్న భయంకరమైన కుట్రల నేపథ్యంలో మూడు విప్లవ మహిళా సంఘాలు ఐక్యంగా కలిసి, పనిచేయాలను కోవడం మంచి పరిణామమని అభినందించారు. అన్నిరకాల వివక్షత, అణివేత, లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా మహిళలను సంఘటిత పరిచి ఉద్యమించాల్సిన అవసరాన్ని వివరించారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు గొప్ప సాంప్రదాయంగా కీర్తిస్తున్న మతతత్వ కార్పోరేట్ల శక్తుల దోపిడీని ఎండగట్టారు. నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే స్త్రీలకు సంపూర్ణమైన స్వేచ్ఛ, స్వతంత్రం సిద్దిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఇకమీదట మూడు విప్లవ మహిళా సంఘాలు ఇండియన్ ప్రోగ్రేసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్స్ (భారత ప్రగతిశీల మహిళా సంఘం) గా కొనసాగుతుందని విలీన ప్రకటన చేసుకున్నారు. ఐపిఓడభ్ల్యూ జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.పావనీ, పెర్క సునీత, కోశాధికారి ఎం.పుణ్యవతి, సహాయ, ఉపాధ్యాక్షులు జరాఖాన్, బానుబేగం మరియు బందెల అరుణ, బొనుగుల లలిత తదితరులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు గురువారం రోజు పంపిన పత్రిక ప్రకటనలో ప్రకటించారు. ఇఫ్టూ షేక్ షావలి, రైతు-కూలీ సంఘం నకిరేకంటి చిట్టిబాబు, దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య మహ్మద్ రషీద్, ఎ.ఐ.ఎఫ్.టి.యు. సుదాకర్ నూతనంగా ఏర్పడిన ఐపిఓడభ్ల్యూ మహిళా కార్యవర్గాన్ని అభినందించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top