హైదరాబాద్ ఫిబ్రవరి 2 (ఈ బీ న్యూస్ );: విద్యుత్ వినియోగదారులు మీటర్లకు ఫోన్ నంబర్‌ను లింక్ చేసుకోవాలని ఆ సంస్థ అధికారులు కీలక సూచనలు చేశారు. ఫోన్ నంబర్‌ను లింక్ చేసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరెంట్ ఉంటుందో తెలుస్తుందని.. ఇందుకు సంబంధించి ఫోన్‌కు ఓ మెసేజ్ వస్తుందని తెలిపారు. బిల్లు వివరాలను కూడా మెసేజ్‌లో తెలుసుకోవచ్చని అన్నారు. ఫోన్ నంబర్‌ను లింక్ చేయడానికి వినియోగదారులు tssouthernpower.com వైబ్సైట్లో చూడాలని విద్యుత్ అధికారులు తెలిపారు. కరెంట్ మీటర్ రీడర్ తీసుకునే వ్యక్తి వచ్చినప్పుడు.. ఫోన్ నంబర్ అతనికి ఇవ్వాలని విద్యుత్ అధికారులు సూచించారు
.















