EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కొనే ప్రతి ఒక్క వస్తువు అది నకిలీదా కాదా అవగాహన కలిగి ఉండాలి. యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన కార్యక్రమం

హైదరాబాద్ ఫిబ్రవరి 2 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని అరూర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో వినియోగదారుల అవగాహన కార్యక్రమం 2024 ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్జ్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రీతి పాండ్యా మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రీతి పాండ్యా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆన్ లైన్ మోసాలు, కల్తీ ఆహార పదార్థాలు మరియు మనం కొనే ప్రతి ఒక్క వస్తువు అది నకిలీదా లేదా ప్రామాణికమైనదా తెలుసుకునేలా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యూత్ రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరిగేలా యూత్ రెడ్ క్రాస్ విభాగాన్ని ప్రోత్సహించి సైబర్ క్రైమ్ వంటి నేరాలు మీద విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏవి రావు, యం. అనురాధ, యూత్ రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ కన్వీనర్ వి. మణిదీప్ మరియు అరోరా డిగ్రీ మరియు పీజీ కళాశాల హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అర్జున్ రావు, సువర్ణ ఆరోరా డిగ్రీ మరియు పీజీ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Related News

Select the Topic
Scroll to Top