EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి. ఢిల్లీ ఏపీ భవన్‌లో పీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ నేతల ధర్నా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఈ బీ న్యూ స్);: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏపీ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ధర్నాకు మద్దుతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. సాధిస్తాం ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అంటూ కాంగ్రెస్ నేతల నినాదాలు హోరెత్తాయి. ఈ ధర్నాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రెడ్డితో పాటు సీనియర్ నేతలు రఘువీరారెడ్డి కేవీపీ జేడీ శీలం ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్ర రాజు, సుంకర పద్మశ్రీ మస్తాన్ వలి తులసి రెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు.కాగా… అంతకు ముందుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ధర్నా కోసం ఏపీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తుండగా ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడించారు. దీంతో అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

 

Related News

Select the Topic
Scroll to Top