హైదరాబాద్ ఫిబ్రవరి 3 (ఈ బీ న్యూ స్);: అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నవారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కుష్టు వ్యాధి సోకే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని హిందూ కుష్టు నివారణ సంగ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయి చౌదరి అన్నారు. స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం పక్షోత్సవాల సందర్భంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు వైద్యులు పక్షోత్సవాల నిర్వహించి వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ డాక్టర్ జీడీ నాయుడు అన్నారు. అనంతరం శ్రీరామ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది అని డాక్టర్ జీడీ నాయుడు తెలిపారు
.















