EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గాంధీ భవన్ లో ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న డిప్యూటీ సీఎం సతీమణి నందిని మల్లు భట్టి విక్రమార్క,

3.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత(ఈ బీ న్యూస్)గాంధీ భవన్ లో ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం డిప్యూటీ సీఎం సతీమణి నందిని మల్లు భట్టి విక్రమార్కఈరోజు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ ‘ఈ రోజు ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గానికి దరఖాస్తు చేసుకున్నాను,సోనియా గాంధీ ,ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా నుండి పోటీ చేయాలని కోరాం,వాళ్ళు పోటీ చేస్తే అందరం కలిసి కట్టుగా పని చేసి భారీ మెజారిటీతో గెలిపిస్తాం,సోనియా గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని ఖమ్మం నుండి పోటీ చేయకుంటే నాకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్న,నాకు అవాకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తా,కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాం,తెలంగాణలో అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది,దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయం’ అని చెప్పారు

కదిలిన ఖమ్మం కాంగ్రెస్…

నందినమ్మకు ….వందనం…

ఖమ్మం నుండి భారీగా కార్ల ర్యాలీ …

హైద్రాబాద్ నగర శివార్లలో స్వాగతం పలికిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి… మేళా తాళాలు,బాణసంచా కాలుస్తూ యువత కేరింతలు,మహిళలతో కలిసి గాంధీ భవన్ లో భారీ ఎంట్రీ ఇచ్చిన మల్లు నందిని విక్రమార్క .కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థత్వానికి మల్లు నందినివిక్రమార్క దరఖాస్తుచేసుకున్నప్పుడు వారి తో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తోపాటు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top