హైదరాబాద్ ఫిబ్రవరి 4 (ఈ బీ న్యూ స్);: మహానగరంలో రోడ్ల ఆక్రమణ పర్యావరణంపై పెనుప్రభావం చూపుతోందని, జీహెచ్ఎంసీ సమన్వయంతో ఫుట్ పాత్ సహా ఆక్రమణల నియంత్రణ చేయాలని కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య, జాతీయ సలహాదారులు డాక్టర్ కోమటిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. నగర వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యల్లో కొత్త వాహనాలు రోడ్ల పైకి వస్తున్న నేపథ్యంలో అనివార్యంగా రద్దీ పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో రోడ్డు, ఫుట్పాత్ ఆక్రమణలు మరింత రద్దీకి కారణమై కర్భన ఉద్గారాలు పెద్దస్థాయిలో విడుదలవుతూ పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. మరోవైపు నగరంలో అనేకప్రాంతాల్లోనిత్యం రాంగ్ రూట్ లో వాహనాలు నడుపుతూ సమస్యలు సృష్టిస్తున్నారని, నగరంలో లక్షల్లో ఉన్న సీసీ కెమెరాల సాయంతో సమస్య పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ బాధ్యత అందరిదీ అని అక్రమణలపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.















