EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వైసీపీ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి

నెల్లూరు ఫిబ్రవరి 4 (ఈ బీ న్యూ స్);: వైసీపీ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. ఆదివారం నాడు జనసేన ఆధ్వర్యంలో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి జనసేనకులు, పవన్ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ… ‘‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డబ్బు, ఆస్తులకి కొరవేముంది. అత్తారింటికి దారేదిలో క్యారెక్టరే పవన్ నిజమైన జీవితం. ప్యాకేజీ… ప్యాకేజీ… అంటారా. పేద, నిరుపేదలందరిని పైకి తీసుకురావడమే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ. కులాలు, మతాలకు అతీతంగా ఉండాలని, సమాజం కోసం బతకాలని పవన్ కళ్యాణ్ చెబుతారు. ఎవరూ కలవలేని పవన్ కళ్యాణ్ అందరిలోకి వస్తున్నారు. అందరితో కలవాల్సిన సీఎంని అయిదేళ్లుగా ఎవరూ కలవలేకపోతున్నారు. యువత, పవన్ అభిమానుల సత్తా ఏమిటో చూపుతాం. పవన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఎవరాపుతారో ఆపండి… చూస్తాం.. ఈ సారి పవన్ అసెంబ్లీకి వెళ్లడం పక్కా. మద్యపాన నిషేదంపై హామీ ఇచ్చిన ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నారు. మరి మీరూ… మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. సీఎం జగన్ పవన్‌పై విమర్శలు చేసే ముందు.. వైసీపీ కోసం కష్టపడే ద్వితీయ శ్రేణి నేతల, కార్యకర్తల కష్టాలను పరిష్కరించాలి’’ అని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై జానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు‌

.

 

Related News

Select the Topic
Scroll to Top