EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విప‌క్షాలు సుదీర్ఘ కాలం విప‌క్షంలోనే ఉండాల‌ని భావిస్తున్నాయి. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ దుకాణంకు తాళాలు వేస్తాం

న్యూఢిల్లీ ఫిబ్రవరి 5 (ఈ బీ న్యూ స్);: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రసంగించారు.75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నామ‌న్నారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో సెన‌గోల్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ సంఘ‌ట‌న‌ల‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటామ‌న్నారు. విప‌క్షాల చ‌ర్య‌లు విచిత్రంగా ఉన్నాయ‌ని, సుదీర్ఘ కాలం విప‌క్షంలోనే ఉండాల‌ని ఆ పార్టీలు భావిస్తున్నాయ‌ని ప్ర‌ధాని ఆరోపించారు. ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే ధైర్యాన్ని విప‌క్ష స‌భ్యులు కోల్పోయార‌ని ఆయ‌న పేర్కొన్నారు. విపక్షాలు ఎన్నికల్లో పోటీకి దూరంగా జరుగుతున్నాయని, పోటీ చేయాలనే సంకల్పమే లోపించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి వాళ్లు రాజ్యసభకు వచ్చే ఆలోచనలో ఉన్నారని విసుర్లు విసిరారు. బీజేపీతో పోటీకి వణికిపోతున్నారని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోదీ సోమవారం సమాధానం ఇచ్చారు. దేశంలో నాలుగు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలు చేయడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని. ఎన్నికల్లో ఓటమి కోసమే విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. విపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని అన్నారు. మైనారిటీలంటూ ఎంతకాలం విభజన రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. తోటి విపక్షాలను కాంగ్రెస్ ఎదగనీయలేదని, కాంగ్రెస్ తీరు దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని అన్నారు.ఈ ప్రభుత్వానికి ఇదే చివరి లోక్‌సభ సమావేశం కావడంతో.. తన స్పీచ్‌లో పొలిటికల్ స్పైసీని బాగానే దట్టించారు. మరోసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తూనే.. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో చివరి ప్రసంగం ఇచ్చిన ప్రధాని మోదీ.. విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.దేశానికి చెందిన నాలుగు స్తంభాల‌ను త‌న ప్ర‌సంగంలో ఆమె ఫోక‌స్ చేశార‌న్నారు. పిల్ల‌ర్లు ఎంత దృఢంగా ఉంటే, దేశం అంత వేగంగా వృద్ధి సాధిస్తుంద‌ని రాష్ట్ర‌ప‌తి భావించిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. దేశంలో విప‌క్షం బ‌ల‌హీనంగా ఉండ‌టానికి కాంగ్రెస్ పార్టీయే కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా మారేందుకు కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం వ‌చ్చింద‌ని, కానీ వాళ్లు ఏమాత్రం ఎద‌గ‌లేద‌ని, అంతేకాదు ఇత‌ర విప‌క్ష పార్టీల‌ను కూడా ఎద‌గ‌కుండా చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.కాంగ్రెస్ పార్టీ దుకాణాన్ని మూసివేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే ఆ దుకాణంకు తాళాలు వేస్తామ‌న్నారు. మ‌రోసారి ప్ర‌ధాని మోదీ కుటుంబ పాల‌న‌పై సీరియ‌స్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ త‌న కుటుంబానికి మించి ఎక్కువ‌గా ఆలోచించ‌లేక‌పోయింద‌న్నారు. ప్ర‌పంచంలో భార‌త్ మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రిస్తుంద‌ని, ఇది మోదీ గ్యారెంటీ అంటూ ప్ర‌ధాని తెలిపారు. ప్రస్తుత లోక్‌సభలో ఇదే మోదీ చివరి ప్రసంగం కావడం విశేషం

.

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top