EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

60 గ్రూప్-1 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

ఫిబ్రవరి 6 (ఈ బీ న్యూస్); : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో 60 గ్రూప్-1 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. గ‌తంలో 503 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కొత్త‌గా పోస్టుల‌ను మంజూరు చేయ‌డంతో వీలైనంత త్వ‌ర‌గా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. అయితే ఈ పోస్టుల‌కు స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ ఇవ్వాలా..? లేదా.. పాత నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి కొత్త నోటిఫికేష‌న్ జారీ చేసే దిశ‌లో టీఎస్‌పీఎస్సీ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ గ‌తేడాది జూన్‌ 11వ తేదీన టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు

.

 

Related News

Select the Topic
Scroll to Top