EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్దం… రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

9.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత(ఈ బీ న్యూస్).రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అత్యంత వైభవంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను  నిర్వహించనున్నట్లు తెలియ చేసారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్దం అయ్యిందని భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం అని చెప్పారు.4000 వేల మంది పారిశుధ్య కార్మికులు జాతర ఏర్పాటు పనుల్లో ఉన్నారనిజాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తాం అని చెప్పారువీఐపీ , వీవీఐపీ ల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.జాతరకు వచ్చే భక్తులకు వైద్యశాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని , RTC మహిళ సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్, 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.మేడారం మహా జాతరకు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని వివరించారు . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ ఎస్పీ శబరిష్ ఐపీఎస్ ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్ గారు,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ గారు డిఎస్పీ రవీందర్ గారు, పూజరుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు దేవాదాయ శాఖ అధికారి రాజేంద్రం గారు తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు ఈకార్య క్రమంలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top