11.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత (ఈ బీ న్యూస్)పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1,000 బస్సులు కొంటామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు. ఈ పథకంతో ఆర్టీసీ బలోపేతం అవుతోందని, రోజుకు రూ.13 కోట్లను TSRTC సంస్థకు చెల్లిస్తున్నామని తెలిపారు. త్వరలో ఆర్టీసీ కార్మికులకు రూ.280 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు.















