Khammam buero Nalubola madhulatha.(ఈ బీ న్యూస్)ఖమ్మం పట్టణంలోని SR & BGNR కళాశాల మైదానంలో11. 2.2024 న విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ త్రిశుల్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి శ్రీ తాండ్ర వినోద్ కుమార్. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి యువతరంలో స్వార్థపూరితమైన భావాలను వదిలి నా దేశం,ధర్మం, సంస్కృతి అనే భావనను మనసుల్లో నింపుకోవడానికి నిరంతరం ఈ దేశం కోసం తన్ మన్ ధన్ అర్పించి దేశ రక్షణ చేయడం ధ్యేయంగా పెట్టుకోవాలని, అదేవిధంగా దేశంలో లవ్ జిహది, గోహత్య నివారణ,దేవాలయాలను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. తదనంతరం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(VIHE) వారు ఏర్పాటు చేసిన పుస్తక వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వివేకానంద గారి గురించిన పుస్తకాలను పలువురికి అందించారు..ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.















