EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

చంచల్ గూడ జైల్లో అనుమానాస్పద స్థితిలో ఓ ఖైదీ మృతి

హైద రాబాద్ ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూ స్): చంచల్ గూడ జైల్లో అనుమానాస్పద స్థితిలో ఓ ఖైదీ మృతి చెందాడు. కిస్మత్ పూర్‌కు చెందిన ముడావత్ రాజును గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిలో దొంగతనం చేసిన కేసులో ముడావత్ రాజు, శ్రీనులు నిందితులుగా ఉన్నారు. వారెంట్ ఉండడంతో రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్ గూడ జైల్‌కు తరలించారు. సోమవారం ఉదయం రాజు చనిపోయాడంటూ అతని కొడుకుకు పోలీసులు ఫోన్ చేశారు. దీంతో రాజు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Related News

Select the Topic
Scroll to Top