హైదరాబాద్ ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూ స్); ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించడానికి జర్నలిస్టులు సైతం కలిసి రావాలని ప్రకృతి ప్రజా కవి గాయకుడు డాక్టర్ జయరాజ్ పిలుపునిచ్చారు. జయరాజ్ పుట్టినరోజును పురస్కరించుకొని జర్నలిస్టులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయరాజ్ మాట్లాడుతూ ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామని తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని తెలిపారు. పేపర్ ప్లేటు, గ్లాసు, ప్లాస్టిక్ బ్యాగులకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే అనే అద్భుతమైన సందేశాత్మక తత్వ గీతాన్ని ప్రజలకు అందించినందుకు డాక్టర్ జయరాజు అన్నని జర్నలిస్టులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు దినపత్రిక ఎడిటర్ గుమ్మడి హరిప్రసాద్, ధరణి దినపత్రిక ఎడిటర్ జి రోజా రాణి, నేత్రం దినపత్రిక ఎడిటర్ ఇంద్రపాల సత్యనారాయణ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.















